Sunday, August 3, 2025

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు: ఆది శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రుద్రంగి: వేములవాడ నియోజకవర్గంలోని ఇల్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 3500ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఇండ్లు పొందిన ప్రజలు అభిమానంతో సీఎం రేవంత్‌రెడ్డి ఫోటోలు పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని, అమలు కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు గట్ల మీనయ్య, పొద్దుపొడుపు లింగారెడ్డి, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, బీసీ మండల అధ్యక్షుడు గండి నారాయణ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎర్రం గంగ నరసయ్య, తర్రె లింగం, మాడిశెట్టి అభిలాష్, నాయకులు ఎర్రం రాజలింగం, పల్లి గంగాధర్, మోతి నరసయ్య, గుగ్గిళ్ళ శ్రీధర్, మహిపాల్, సూర యాదయ్య, దయ్యాల శ్రీనివాస్, అక్కెనపల్లి శ్రీనివాస్, దాసరి గంగరాజం, గండి అశోక్, అంబటి శ్రీధర్, అధికారులు తహసిల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజన్, హౌసింగ్ డీఈ సాజిద్, పీడీ శంకర్‌రెడ్డి, ఏఈ రాంమోహన్, కార్యదర్శి రాందాస్, స్థానిక పోలీసులు, మహిళలు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News