Friday, May 2, 2025

నేడు థామస్‌కప్ ఫైనల్

- Advertisement -
- Advertisement -

ఇండోనేషియాతో భారత్ ఢీ

ఇక పురుషుల విభాగంలో నిర్వహించే థామస్‌కప్ ఫైనల్ పోరు ఆదివారం జరుగనుంది. ఈ సమరంలో ఇండోనేషియాతో భారత్ తలపడనుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా థామస్ కప్ బరిలోకి దిగిన భారత్ ఏకంగా ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్లో మలేషియా, సెమీస్‌లో డెన్మార్క్ వంటి బలమైన జట్లను భారత్ ఓడించింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేషియాను కూడా ఓడించాలనే పట్టుదలతో ఉంది. స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్‌లు అసాధారణ ఆటతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇక డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ షెట్టి జోడీ కూడా అసాధారణ ఆటను కనబరుస్తోంది. ఈసారి కూడా మెరుగైన ప్రదర్శనతో జట్టుకు చారిత్రక విజయం అందించాలనే పట్టుదలతో భారత షట్లర్లు ఉన్నారు. ఇక ఫైనల్‌కు చేరడం ద్వారా భారత్ ఇప్పటికే రజత పతకాన్ని ఖాయం చేసుకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News