Sunday, August 3, 2025

ఇండోనేషియాలో లెవోటోబి లకీ లకీ జ్వాలా విస్ఫోటనం

- Advertisement -
- Advertisement -

ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్ని పర్వతాలలో ఒకటైన మౌంట్ టెవోటోబి లకీ లకీ వరుసగా రెండో రోజు కూడా బద్ధలైంది. శనివారం తెల్లవారుజామున అగ్ని పర్వత పదార్థాలు, బూడిద ఆకాశంలోకి 18 కిమీ. వరకు వ్యాపించింది. అంతేకాదు అనేక గ్రామాలు శిథిలాలతో నిండిపోయాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఇండోనేషియా భూగర్భ శాస్త్ర సంస్థ పర్వత వాలుల నుండి ఐదు కిలోమీటర్ల మేరకు లావా ప్రవహిస్తున్న విషయాన్ని నమోదు చేసింది. డ్రోన్ల ద్వారా శిలాధ్రవాన్ని(మాగ్మా), దాని కదలికను రికార్డు చేశారు.

అంతేకాదు భూకంప మానిటర్లలో ప్రకంపనలు కూడా నమోదయ్యాయి. మారుమూల ద్వీపం ప్లోర్స్‌లోని 1584 మీటర్ల ఎత్తు ఉన్న అగ్నిపర్వతం లెవోటోబి లకీ లకీ జూన్ 18న విస్ఫోటనం చెందినప్పటి నుండి అత్యధిక హెచ్చరిక స్థాయిలో ఉంది. విస్ఫోటనాలు తరచూ జరుగుతుండడం వల్ల మినహాయింపు జోన్‌ను 7 కిమీ. వ్యాసార్థానికి రెట్టించారు. నవంబర్‌లోనే ఇండోనేషియా వేలది మందిని సురక్షిత ప్రదేశానికి తరలించేసింది. ఇండోనేషియా 28కోట్ల మంది జనాభా కలిగిన ద్వీప సమూహం. ఇది తరచూ భూకంపాలకు గురవుతుంటుంది. ఇండోనేషియాలో 120 అగ్నిపర్వతాలున్నాయి. పసిఫిక్ బేసిన్ చుట్టూ గుర్రపు నాడా ఆకారంలో భూకంప దోష రేఖలు…‘రింగ్ ఆఫ్ ఫైర్’ వెంట ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News