- Advertisement -
రాయ్‌పూర్: మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులపై ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్పందించారు. నారాయణపూర్-బీజాపూర్ మధ్య ఇంద్రావతి అభయారణ్యంలో ఎన్‌కౌంటర్ జరిగిందని, రెండ్రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని, కూంబింగ్‌లో భాగంగా నక్సల్స్, పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని వివరించారు.
మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని, ఎదురుకాల్పుల్లో జవాను గాయపడ్డారని, ప్రాణాపాయం లేదని, కాల్పుల్లో అసిస్టెంట్ కానిస్టేబుల్ మరణించారని విజయ్ శర్మ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోలు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయారని ప్రచారం జరుగుతోంది. నంబాళ్ల కేశవరావుపై రూ. కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -