Monday, July 28, 2025

వాగులో నవజాత శిశువు మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

అప్పుడే జన్మించిన నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వాగులో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కేశనాయక్ తండా పరిధిలోని గుబ్బడి వాగులో శిశువు మృతదేహం లభ్యమైన విషయం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనుమానాస్తులు ఎవరైనా ఉంటే సమాచారం అందించాలని గ్రామస్థులను కోరారు. వాగులో లభ్యమైన మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News