Sunday, May 4, 2025

ఐడీఓసీ భవన నిర్మాణ పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో నిర్మిస్తున్న ఐడీఓసీ (ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ ఆఫీస్ కాంప్లెక్స్) భవనాన్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి గోపి అన్నారు. శనివారం ప్రస్తుత కలెక్టరేట్ కాంప్లెక్స్, ఐడీఓసీ భవన నిర్మాణ పనులను, స్పోర్ట్ కాంప్లెక్స్‌ను ఆర్‌అండ్‌బీ అధికారులు, గుత్తేదారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ప్రస్తుత కలెక్టరేట్ భవనంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యాలయాలను పరిశీలించారు.

త్వరలోనే ఐడీఓసీ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని గుత్తేదారు తెలపడంతో, తాత్కాలికంగా కలెక్టరేట్‌ను తరలించడం కొరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్మించిన స్పోర్ట్ కాంప్లెక్స్ గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ, ఈఈ సాంబశివరావు, తహసిల్దార్ సుధాకర్, స్పోర్ట్ అధికారి రాజవీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News