ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
ఈసారి 70 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి డిఎస్ చౌహాన్ కార్యరంగంలోకి దిగారు. శనివారం హనుమకొండ జిల్లాలోని పలు ధాన్యం సేకరణ కేంద్రాలను సందర్శించి, ధాన్యం కొనుగోలు సెంటర్లలో పర్యటించి వాటి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పిఎసిఎస్) ఉనికిచెర్ల, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పిఎసిఎస్)ధర్మసాగర్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పిఎసిఎస్)తెల్లాకులగూడెం, ఇందిరాక్రాంతిపథం(ఐకెపి) ధర్మసాగర్ కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం సేకరణ, కొనుగోలు వ్యవహారాలను పరిశీలించారు.
ప్రతి కేంద్రంలో అధికారులు, రైతులను ఆయన స్వయంగా కలుసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా జరిగేందుకు వీలుగా అందుబాటులో ఉన్న హార్వెస్టర్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యత కోసం ప్రతి కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు ఉపయోగించాలని, ట్యాబ్ ఎంట్రీలు వేగంగా పూర్తి చేసి, రైతులకు చెల్లింపులు త్వరగా చేయాలని చౌహాన్ సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విధానాన్ని పారదర్శకంగా, వేగవంతంగా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారయంత్రాంగం విధులు నిర్వహించాలని నిర్దేశించారు.
రబీ ధాన్యం కొనుగోలు లక్ష్యాలు
నెల కొనుగోలు(లక్షల మెట్రిక్ టన్నులు)
మార్చి 2025 3.70
ఏప్రిల్ 2025 27.32
మే 2025 34.21
జూన్ 2025 4.90
మొత్తం 70.13
గత పదేళ్ళుగా రబీ పంట సేకరణ వివరాలు(2014-15 నుంచి 2024—-25)
సంవత్సరం లక్షల మెట్రిక్ టన్నులు
2014-15 13.26
2015-16 8.44
2016-17 37.32
2017-18 35.81
2018-19 37.06
2019-20 64.17
2020-21 92.28
2021-22 50.39
2022-23 66.84
2023-24 47.34
2024-15 70.13