Saturday, July 26, 2025

లైబ్రరీలు ఆధునిక బాటపట్టాలి

- Advertisement -
- Advertisement -

తెల్లకాగితం నుంచి టాబ్లెట్‌ల దాకా వచ్చిన ఈ సమాచార విప్లవ యుగంలో లైబ్రరీల పాత్ర కూడా అభివృద్ధి చెందుతోంది. సమాచార అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో లైబ్రరీ నిపుణులు అనేక కొత్త సాంకేతిక పద్ధతులను అవలంబించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఐసిటి (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) పరిజ్ఞానం, వారికి అత్యవసరంగా మారింది. సమాజంలో సమాచార సరఫరా కేంద్రంగా లైబ్రరీలు వ్యవహరిస్తున్నాయి. గతంలో ముద్రిత పుస్తకాలు ప్రధాన వనరులు కాగా, ప్రస్తుతం డిజిటల్ వనరులు, ఆన్‌లైన్ డేటాబేస్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది లైబ్రరీ నిపుణుల నుండి కొత్తరకం టెక్నాలజీ నైపుణ్యాల అభివృద్ధిని కోరుతోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచార వినియోగం, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ టెక్నాలజీ ఆధారితంగా జరుగుతుంది. దీనితోపాటు లైబ్రరీలూ ఇప్పుడు డిజిటల్ వనరులు, ఆన్‌లైన్ సేవలు, ఇంటిగ్రేటెడ్ లైబ్రరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (ఐఎల్‌ఎంఎస్) వైపు దూసుకెళ్తున్నాయి.

ఈ మార్పుల మధ్య లైబ్రరీ నిపుణులకు సమాచార కమ్యూనికేషన్ సాంకేతిక (ఐసిటి) నైపుణ్యాల అవగాహన, అవలంబన, వినియోగం అత్యంత కీలకంగా మారింది. సమాచారం శోధనను వేగవంతం చేయడం, డిజిటల్ వనరుల నిర్వహణ, వినియోగదారుల అవసరాలను త్వరగా తీర్చడం, ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం పంచడం, ఇంటర్నెట్ ఆధారిత సేవల అందుబాటు, డిజిటల్ సమాజంలో లైబ్రరీల (Libraries digital society) ఉనికి కాపాడడం అవసరం లైబ్రరీ నిపుణులకు అవసరమైన ఐసిటి నైపుణ్యాలు ఆధునిక డిజిటల్ యుగంలో చాలా కీలకంగా మారాయి. ఈ నైపుణ్యాలు లైబ్రరీ సేవల మౌలికతను మెరుగుపరచడంలో, వినియోగదారుల అవసరాలను సమర్థవంతంగా తీర్చడంలో, సమాచారాన్ని వేగంగా, సమర్థంగా అందించడంలో సహాయపడతాయి.

లైబ్రరీ నిపుణులకు అవసరమైన ఐసిటి నైపుణ్యాలు కంప్యూటర్ ఫండమెంటల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ (విండోస్, లినక్స్ మొదలైనవి), ఫైలింగ్ సిస్టమ్ అవగాహన అవసరం. లైబ్రరీ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ (ఎల్‌ఎంఎస్) అయినటువంటి Koha, SOUL, NewGenLib వంటి Integrated Library Systems (ILS) లో నైపుణ్యం క్యాటలాగింగ్, సర్క్యులేషన్, అక్విజిషన్, సీరియల్స్ మేనేజ్‌మెంట్ వంటివి నిర్వహించడం కోసం సమాచార కమ్యూనికేషన్ సాంకేతిక నైపుణ్యాలు అవసరం. డిజిటలైజేషన్ & డిజిటల్ లైబ్రరీ నిర్వహణ, డిజిటల్ కంటెంట్ స్కానింగ్, ఫార్మాటింగ్, DSpace, Greenstone వంటి డిజిటల్ లైబ్రరీ సిస్టమ్స్‌లో పనితనం, Institutional Repositories నిర్వహణకు సమాచార కమ్యూనికేషన్ సాంకేతిక నైపుణ్యాలు అవసరం. ఇ-రీసోర్సెస్ నిర్వహణ e-Journals, e-Books, Databases (JSTOR, ProQuest, EBSCO etc.) యాక్సెస్ చేయడం, DOI, Open Access resources గుర్తించడం.

ఇంటర్నెట్, వెబ్ టెక్నాలజీ నైపుణ్యాలు అయినటువంటి వెబ్ బ్రౌజింగ్, సెర్చ్ ఇంజిన్లు వినియోగం, Online Public Access Catalog (OPAC) పరిచయం, Web 2.0 tools (Blogs, Wikis, RSS Feeds) వినియోగం 6. సోషల్ మీడియా అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇమెయిల్, జూమ్, గూగుల్ మీట్ ద్వారా సమాచారం పంచుకోవడం, లైబ్రరీ ప్రచారం, వర్క్‌షాప్‌లు నిర్వహణకు సమాచార కమ్యూనికేషన్ సాంకేతిక నైపుణ్యాలు అవసరం.MS Office Tools అయినటువంటి MS Word, Excel, PowerPointలను ఉపయోగించి రిపోర్టులు, ప్రెజెంటేషన్లు తయారు చేయడం. ముల్టీమీడియా టూల్స్ వినియోగం వీడియో, ఆడియో, గ్రాఫిక్స్ ను ఉపయోగించి ఇంటరాక్టివ్ కంటెంట్ తయారీ నిర్వహణకు సమాచార కమ్యూనికేషన్ సాంకేతిక నైపుణ్యాలు అవసరం.

సైబర్ భద్రత అవగాహన డేటా ప్రైవసీ, యూజర్ డేటా సురక్షితంగా నిర్వహణకు అవసరం. AI అండ్ Machine learning పై అవగాహన Generative AI (ChatGPT, Gemini), Citation Tools, Reference Managers (Zotero, Mendeley) Remote access వాడకంపై అవగాహన, సాంకేతిక నైపుణ్యాలు అవసరం. ఈ నైపుణ్యాల సాధన వల్ల లైబ్రరీ నిపుణులు సేవల నాణ్యతను మెరుగుపరచగలరు. యూజర్లకు వేగవంతమైన, నైతిక సమాచారాన్ని అందించగలరు, తాము డిజిటల్ యుగానికి తగినవారిగా ఎదగగలరు. కొవిడ్ 19 లాంటి విపత్తుల సమయంలో అనేక లైబ్రరీలు మూసివేయబడినప్పటికీ, డిజిటల్ సేవలు వలన లైబ్రరీలు యూజర్లకు సేవలు అందించగలిగాయి.

ఇది ఐసిటి ప్రాముఖ్యతను మరింత రుజువు చేసింది. యునెస్కో, ఐఎఫ్‌ఎల్‌ఎ వంటి సంస్థలు భవిష్యత్తులో గ్రంథపాలకులు సాంకేతికంగా నైపుణ్యాలు కలిగిన వారిగా ఉండాలని ప్రోత్సహిస్తున్నాయి. లైబ్రరీ నిపుణులు సమాచారం మార్గదర్శకులు. ఈ మార్గదర్శక పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలంటే, సాంకేతిక నైపుణ్యాలు లేకుండా సాధ్యం కాదు. మారుతున్న సమాచార సమాజానికి తగ్గట్లు, ఐసిటి నైపుణ్యాలు పొందడం అనేది ప్రస్తుతానికే కాదు, భవిష్యత్తుకీ కీలకం. ఈ డిజిటల్ యుగంలో సమాచార పరిమాణం వేగంగా పెరుగుతుంది. వాడుకదారులకు అవసరమైన సమాచారం సమయానికి, ఖచ్చితంగా, సరైన ఫార్మాట్‌లో అందించేందుకు ICT నైపుణ్యాలు అనివార్యం. భవిష్యత్తులో లైబ్రరీ నిపుణులు కేవలం పుస్తకాల నిర్వాహకులు కాకుండా -సాంకేతిక, సమాచార, డిజిటల్ నిపుణులు అవుతారు.

  • కోమల్ల ఇంద్రసేనారెడ్డి
    98493 75829
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News