Friday, July 18, 2025

మహిళలకు వడ్డీ లేని రుణాలు: దేవరకద్ర ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

మహిళలను ఆర్థికంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్షం
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
మన తెలంగాణ/ దేవరకద్ర ః మహిళలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుందని ఈ రుణాలతో మహిళలను ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్షంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో దేవరకద్ర, సిసికుంట, కౌకుంట్ల, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, ఆరు మండలాలకు చెందిన మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశ ప్రధానిగా పని చేసిన ఉక్కు మహిళా ఇందిరా గాంధీ మహిళలకు ఆదర్శం అన్నారు.

ఇందిరా గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో భూ సంస్కరణలు, బ్యాంకులు జాతీయకరణతో పాటు గరీబి హటావో నినాదంతో ఎన్నో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంకు మహిళల పేరు మీద ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. విద్య, వైద్యంకు ప్రాధాన్యతనిస్తున్నట్లు దేవరకద్ర నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, నియోజకవర్గంలో అనేక కొత్త ఆసుపత్రుల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ మంజూరు చేసి నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఇటీవల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గం ఎన్నిక పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.

మహిళా సంఘాలు చురుగ్గా పని చేయాలని అన్నారు. కుటుంబం బాగుతో పాటు ఊరు, మండలం, నియోజకవర్గం బాగు, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. మహిళా శక్తి ద్వారా గత సంవత్సరం నుండి మహిళా శక్తి క్యాంటీన్‌లు, బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి రుణం, పౌల్ట్రీ పాం, సోలార్ పవర్ ప్లాంట్‌లు, గోదాంలు నిర్వహణ, పెట్రోల బంక్‌లు ఏర్పాటు చేసి వారి ఆర్థిక వృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ నర్సింహులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జిల్లా సహకార అధికారి శంకరాచారి, మండల ప్రత్యేక అధికారులు కృష్ణయ్య, ఎంపిడిఓ శ్రీనివాస రావు, ఏపిఎం రామన్న, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News