Tuesday, September 2, 2025

మహిళా క్రికెట్‌పై కాసుల వర్షం

- Advertisement -
- Advertisement -

భారీగా పెరిగిన వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ

దుబాయి: మహిళా క్రికెట్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కాసుల వర్షం కురిపించనుంది. భారత్, శ్రీలంక క్రికెట్ బోర్డులు మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్‌యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్‌కప్ కోసం ప్రైజ్‌మనీని ఐసిసి అనూహ్యంగా పెంచేసింది. పురుషుల 2023 వరల్డకప్ కంటే ఈసారి మహిళల ప్రపంచకప్‌నకు ఆధిక ప్రైజ్‌మనీని కెటాయించడం గమనార్హం. గతంలో మహిళల వరల్డ్‌కప్‌కు కేటాయించిన నగదు బహుమతి కంటే ఈసారి మూడు రెట్లు అధికంగా ప్రైజ్‌మనీని ఐసిసి ప్రకటించింది.

ఈసారి వరల్డ్‌కప్ టోర్నమెంట్ ప్రైజ్‌మనీని 13.88 మిలియన్ డాలర్లు కేటాయించింది. గతంతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికం. అప్పట్లో 3.5 మిలియన్ డాలర్లను మాత్రమే ఐసిసి ప్రైజ్‌మనీగా ప్రకటించింది. ఈసారి ప్రైన్‌మనీని ఊహించని రీతిలో పెంచింది. వరల్డకప్ విజేతగా నిలిచే జట్టుకు రూ.39.50 కోట్లు ప్రైజ్‌మనీగా అందిస్తారు. రన్నరప్ టీమ్‌కు రూ.19.78 కోట్లు నగదు బహుమతిని అందజేస్తారు. ఇక సెమీస్‌కు చేరే జట్లకు చెరో రూ.9.75 కోట్ల చొప్పున చెల్లిస్తా రు. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచే జట్లకు రూ.4.50 కోట్లు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచే టీమ్‌లకు రూ.2.20 కోట్ల చొప్పున అం దిస్తారు. ఇక వరల్డ్‌కప్‌లో ఆడిన ప్రతి జట్టుకు అదనంగా రూ. 2 కోట్లను చెల్లిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News