Monday, July 14, 2025

హర్మన్ ప్రీత్ నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

దుబాయి: భారత విమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నయా రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. మాజీ సారధి మిథాలీ రాజ్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఈ ఘనత సాధించింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్ హర్మన్‌కు 182వ టి20 కాగా.. ఇది 334వ అంతర్జాతీయ మ్యాచ్. ఇందులో 142 వన్డేలతో పాటు 6 టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి. 1999-2019 మధ్య మిథాలీ రాజ్ 333 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెట్‌లో హర్మన్, మిథాలీ రాజ్ తర్వాత జులాన్ గోస్వామి (284), స్మృతి మంధాన, దీప్తిశర్మ(239)లు ఉన్నారు.

36 ఏళ్ల హర్మన్ తన కెరీర్‌లో 8 శతకాలతో పాటు 85 హాఫ్ సెంచరీలు నమో దు చేసింది. అన్డేల్లో అత్యధిక స్కోర్ 171. వన్డేల్లో హర్మన్‌కు ఇది టాప్ స్కోర్. ఓవరాల్‌గా అత్యధిక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు (International cricket matches )ఆడిన మహిళా క్రికెటర్లలో హర్మన్ మూడో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ స్టార్ సూజీ బేట్స్ 346 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ(337) హర్మన్ కంటే ముందున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టర్ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా అమ్మాయిలు 5 వికెట్ల తేడాదో ఓటమిపాలయ్యారు. కానీ, 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది హర్మన్ సేన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News