- Advertisement -
తిరుపతి: తిరుమలలో మరో అపచారం వెలుగులోకి వచ్చింది. హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలకు మద్యం మత్తులో ముగ్లురు కానిస్టేబుళ్లు వచ్చారు. ఎపిఎస్ పి కానిస్టేబుళ్లు ఘాట్ రోడ్డుపై ఇతర వాహనాలను ఢీకొడుతూ తిరుమలకు వచ్చారు. సదరు కానిస్టేబుళ్లను అలిపిరిలో టిటిడి భద్రత సిబ్బంది గుర్తించలేదా? తరచుగా ఇలాంటివి జరుగుతున్నా టిటిడి ఎందుకు పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. తిరుమల కొండపై కూడా గతంలో మద్యం బాటిళ్లు దొరికిన విషయం తెలిసిందే. టిటిడి ఎందుకు అలసత్వం వహిస్తున్నారని వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు.
- Advertisement -