- Advertisement -
ఢిల్లీ: పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్‌లో చొరబాటుదారుడు హతమయ్యాడు. పాకిస్తానీ చొరబాటుదారుడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సరిహద్దును దాటేందుకు యత్నించడంతో అతడిపై బిఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. మృతదేహాన్ని పోలీసులకు బిఎస్ఎఫ్ అప్పగించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మెస్సైల్ దాడులు నిర్వహిస్తోంది.ఈ దాడులను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంటుంది. పంజాబ్‌లో మిస్సైల్ భాగాలను భారత ఆర్మీ గుర్తించింది. నిన్న రాత్రి నుంచి పంజాబ్ సరిహద్దుల్లో పాక్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంది. దీంతో భారత జవాన్లు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. పాకిస్తాన్ లోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనూ తొమ్మిది టెర్రరిస్ట్ శిబిరాలపై 24 క్షిపణులను ప్రయోగించి భారత్ భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. 100 మందికి పైగా టెర్రరిస్ట్ లను మట్టుపెట్టినట్టు సమాచారం.
Intruder killed in Ferozepur
- Advertisement -