- Advertisement -
భారత్ పాకిస్థాన్ సరిహద్దు గుండా గుజరాత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ చొరబాటుదారుడిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్‌ఎఫ్) కాల్చి చంపిందని అధికారులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి బనస్కాంతలోని అంతర్జాతీయ సరిహద్దు కంచె దాటి అనుమానిత వ్యక్తి చొరబడడాన్ని బిఎస్‌ఎఫ్ బలగాలు గుర్తించాయి. ‘మొదట చొరబాటుదారుడిని సవాలు చేశాయి, అయినా అతడు ముందుకు చొచ్చుకు రావడంతో అతడిపై కాల్పులు చేయక తప్పలేదు. దాంతో అతడిని చంపేయాల్సి వచ్చింది’ అని బిఎస్‌ఎఫ్ తన ప్రటకటనలో పేర్కొంది.
- Advertisement -