పది సంవత్సరాలు అధికారంలో ఉండి, సంగరేణి సంస్థకు గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంస్థను దోచి, నాశనం పట్టించారని ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసార్ ఆరోపించారు. ఆమె ఇంట్లో పంచాయతీ పెట్టుకుని హెచ్ఎంఎస్తో పొత్తు పెట్టుకోనున్నట్లు కవిత చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. కవిత మాటలను కార్మికులు విశ్వసించరని ఆయన చెప్పారు. కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఐదు కొత్త బొగ్గు గనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా, ఈ పదేళ్ళలో ఒక్కటి కూడా ప్రారంభంకాలేదన్నారు. ఈ పదేళ్ళలో సింగరేణి కార్మికుల 30 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల రూపాయల చొప్పున బోనస్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కృషి వల్లే సింగరేణి లాభాల బాటలో పయనిస్తున్నదని జనక్ ప్రసాద్ తెలిపారు.
సింగరేణిని దోచుకుని నాశనం చేశారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -