Thursday, May 29, 2025

ఐపిఎల్ లో కోహ్లీ మూడు అరుదైన రికార్డులు

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు నెలకొల్పాడు. నిన్న లక్నో సూపర్ జాయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాయల్‌ ఛాలెంజర్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ అర్థశతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో మూడు అరుదైన ఘనతలు సాధించాడు. టీ20ల్లో బెంగళూరు తరఫున 9 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. అలాగే, ఐపిఎల్ లో ఆరసార్లు 600 పరుగులు చేసిన ఏకైక క్రికెట్ గా, ఐపిఎల్‌ చరిత్రలో అత్యధిక హాఫ్‌సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో డేవిడ్‌ వార్నర్‌ను రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇప్పటివరకు ఐపిఎల్ లో అత్యధిక అర్థశతకాలు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నోపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతోె బరిలోకి దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలనే నాలుగు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News