Thursday, May 22, 2025

సూర్య, నమన్ విధ్యంసం.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్‌ తడబడి నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(73 నాటౌట్) అద్భుత అర్ద శతకంతో ముంబయి జట్టును ఆదుకున్నాడు. సూర్యతోపాటు చివర్లో నమన్(24, 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లో విధ్యంసం సృష్టించారు. వీరి వీరబాదుడుకు లాస్ట్ 12 బంతుల్లో ఏకంగా 48 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై, ఢిల్లీ జట్టుకు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News