- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా ఆదివారం క్రికెట్ లవర్స్ కు డబుల్ ధమాకా లభించనుంది. ఇవాళ రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. కోల్ కతా వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైటర్ రైడర్సక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్న కోల్ కతా, రాజస్థాన్ జట్లు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారనున్నాయి. మరోవైపు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. నాలుగోస్థానంలో ఉన్న పంజాబ్, ఆరో స్థానంలో ఉన్న లక్నో.. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తున్నాయి.
- Advertisement -