- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు. అయితే, ఆరు ఓవర్లు కుదించి.. 14 ఓవర్లు ఆడించనున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 4 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(0), రజత్ పటిదార్(15)లు ఉన్నారు.
- Advertisement -