Saturday, August 9, 2025

ఈఎన్‌సి అనిల్‌పై బదిలీ వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) జి.అనిల్ కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈఎన్సీ(జనరల్) పోస్టు నుంచి తొలగిస్తూ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆ దేశించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొ జ్జ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అనూహ్యమైన ఈమలుపు నీటిపారుదల శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. మేడిగడ్డ బ్యారేజ్ గ్రౌటింగ్ వ్యవహారం అంశంతో పాటు ఇటీవల ఎసిబికి పట్టుబడిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) నూనె శ్రీధర్‌తో ఈఎన్సీఅనిల్ కుమార్‌కు సన్నిహిత సంబంధా లు ఉన్నట్లు ఎసిబి గుర్తించింది. నూనె శ్రీధర్‌ను ప్రభుత్వం బదిలీచేసినప్పటికీ అతన్ని రిలీవ్ చేయకుండా ఈఎన్సీ అనిల్ కుమార్ సహకరించారని సమాచారం. అంతే కాకుండా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్న

నేపధ్యంలో నీటిపారుదల శాఖకు సంబంధించి కీలక సమాచారం బయటికిలీక్ అవుతోందన్న ఆరోపణల కారణంగా ఆయనకు స్థానచలనం జరిగినట్లుగా చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజి గ్రౌటింగ్ వ్యవహారంలో బ్యారేజికి సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఎ) నిపుణు ల కమిటి తుది నివేదికలో వెల్లడించింది. ఎవరి ఆదేశాల మేరకు గ్రౌటింగ్ చేశారనే దానికి ఈఎన్సీ అనిల్ కుమార్ నుంచి  స్పష్టమైన సమాధానం లేకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌డిఎస్‌ఎ నివేదికలోని అంశాలపై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సమావేశంలోనూ చర్చించినట్లు తెలిసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) నూనె శ్రీధర్ ను ప్రభుత్వం బదిలీచేసినప్పటికీ అక్కడే కొనసాగేవిధంగా ఈఎన్సీ అనిల్‌కుమార్ అవకాశం ఇవ్వడం గమనార్హం. ఈఎన్సీ(జనరల్)గా అనిల్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించి ఆయన స్థానంలో చీఫ్ ఇంజినీర్ అంజద్ హుస్సేన్‌కు ప్రభుత్వం ఈఎన్సీ(జనరల్)గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News