గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో జనగామ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడిందని ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి ఆరోపించారు. జనగామ జిల్లా, లింగాల ఘనపూర్ మండలం, నవాబ్‌పేట రిజర్వాయర్ నుండి సాగునీటి విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎంఎల్‌ఎ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్, పాలకుర్తి ఎంఎల్‌ఎ మామిడాల యశస్వినిరెడ్డి సమక్షంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. రిజర్వాయర్ గేట్లను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ…కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ భూములకు సాగునీరు అందించాలనే ధ్యేయంతో దేవాదుల పనులను వేగవంతం చేసిందని తెలిపారు.దేవాదుల 3వ దశ 6వ ప్యాకేజీకి క్యాబినెట్ ఆమోదంప్రాజెక్ట్ పెండింగ్ పనుల కోసం రూ.1015 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.
ఈ పనులు ఏడాదిలో పూర్తి చేస్తే నాలుగు నియోజకవర్గాల్లో 78 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.మొదటిసారి లింగాల ఘనపూర్‌లో కాలువల ద్వారా సాగునీరునవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా లింగాల ఘనపూర్, దేవరుప్పుల, గుండాల మండలాల రైతులకు రెండు పంటలకు నీరు అందుతుందని హామీ ఇచ్చారు. ఆన్‌అండ్‌ఆఫ్ విధానంలో నీరు విడుదలవుతుందని, రైతులు దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.2003లోనే దేవాదుల ప్రారంభంతాను నీటి పారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2003లోనే దేవాదుల మొదటి దశ పనులను ప్రారంభించిన విషయాన్ని శ్రీహరి గుర్తుచేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ దేవతలకే సాధ్యమని కొందరు విమర్శించారని, కానీ నేడు జనగామలో వేల ఎకరాలు సాగునీటి పంటలు పండిస్తున్నాయని గర్వంగా తెలిపారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, దేవాదుల చీఫ్ ఇంజనీర్ సుధీర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.