Sunday, August 24, 2025

సనా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి

- Advertisement -
- Advertisement -

కైరో: స్థానిక మీడియా రిపోర్టు ప్రకారం ఇరాన్ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు క్లస్టర్ మందుగుండు సామాగ్రిని ప్రయోగించిన కొద్ది రోజుల తర్వాత, ఆదివారం తెల్లవారు జామున యెమెన్ రాజధాని సనా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. తిరుగుబాటుదారులైన హౌతీలు నడుపుతున్న అల్ మసిరా ఛానల్ ఈ దాడులను రిపోర్టు చేసింది. ఆగస్టు 17 తర్వాత తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న సనాపై దాడిచేయడం ఇదే మొదటిసారి. తిరుగుబాటుదారులు ఉపయోగిస్తున్న ఇంధన మౌలిక సదుపాయాలను లక్షంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. యెమెన్ నుంచి తిరుగుబాటుదారులు ఓ ప్రొజెక్టయిల్‌ను శుక్రవారం రాత్రి ప్రయోగించారని పేరు తెలుప నిరాకరించిన ఓ ఇజ్రాయెల్ వాయుసేన అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ దీనిని ఓ కొత్త రకం ముప్పుగా భావించింది. క్లస్టర్ మిస్సైల్ బాంబులను నిరోధించడం అన్నది ఇజ్రాయెల్ బలగాలకు చాలా కష్టసాధ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News