దోహా: హమాస్ ఉగ్రవాదులను లక్షం చేసుకుని ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా ఖతార్‌పై దాడిచేసింది. మంగళవారం రాత్రి ఖతార్ రా జధాని దోహా లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా ఈ దాడిలో ఎంతమంది చనిపోయారన్నది తెలియలేదు. తమ వైమానిక దళం కార్యాన్ని పూర్తిచేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి కల్నల్ అవిచాయ్ అడ్రాయీ తెలిపారు. ఇదిలావుండగా తమ దేశంలోని హమాస్ రాజకీయ ప్రధానకేంద్రంపై జరిగిన దాడిని ఖ తార్ ఖండించింది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఖతార్ విదేశాంగ ప్రతినిధి మజీద్ అల్అన్సారీ మండిపడ్డా రు. ఇదిలావుండగా ఇజ్రాయెల్ చర్యను ఐక్యరాజ్యసమితి చీప్ ఆంటోనియో గుటెరస్ తప్పుపట్టారు. ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. గాజాలో దాదాప రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణపై చర్చల్లో ఈజిప్ట్‌తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఖతార్ ఈ దాడిని ఖండించింది. సోమవారం జెరూసలెంలోని బస్ స్టాండ్ వద్ద ఆరుగురు వ్యక్తుల మరణానికి కారణమైన కాల్పులకు హమాస్ సాయుధ విభాగం అల్ఖస్సామ్ బ్రిగేడ్స్ బాధ్యత వహించిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగిందన్నది గమనార్హం.
ఖతార్‌పై దాడులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -