నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) భారీ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 320 సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ’ గ్రూప్ ఏ గేజిటెడేడ్ పోస్టుల భర్తీకి గాను అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల సంఖ్య: 320
పోస్టులు: సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ(ఎలక్ట్రానిక్స్): 113 పోస్టులు, సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ(మెకానికల్): 160 పోస్టులు, సైంటిఫిక్ ఇంజినీర్- ఎస్సీ (కంప్యూటర్ సైన్స్): 44 పోస్టులు, సైంటిఫిక్ ఇంజినీర్- ఎస్సీ (ఎలక్ట్రానిక్స్)-పీఆర్‌ఎల్: 02 పోస్టులు, సైంటిఫిక్ ఇంజినీర్- ఎస్సీ (కంప్యూటర్ సైన్స్)-పీఆర్‌ఎల్: 01 పోస్టు
విద్యార్హత: బీఈ, బీటెక్ లో 65 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో పాసై ఉండాలి
దరఖాస్తకు ప్రారంభ తేది: 27 మే 2025
దరఖాస్తుకు చివరి తేది: 16 జూన్ 2025
వయస్సు: 16 జూన్ 2025 నాటికి 28 ఏళ్ల వయస్సు మించకూడదు
జీతం: రూ.56,100
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు: రూ.250
అఫీషియల్ వెబ్ సైట్: https://www.isro.gov.in/