బంగారం దుకాణ దారులే లక్ష్యంగా… హైదరాబాద్, వరంగల్‌లో ఐటీ సోదాలు
వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలోనూ ఐటీ సోదాలు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్‌సేల్ వ్యాపారం చేసే బిజినెస్‌మెన్‌లే టార్గెట్‌గా ఐటి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారాల ఇండ్లపై ఐటి శాఖ అధికారులు దాడులు చేశారు. బంగారం హోల్‌సేల్ లావాదేవీలపై ఆరాతీశారు. కొనుగోలు అమ్మకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంగారం వ్యాపా రంపై దాఖలు చేసిన ఐటీ రిటర్న్ వివరాలు తీసుకున్నారు. గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటరన్స్ పై పలు అనుమానాలు అధికారులు క్యాప్స్ గోల్డ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. మొత్తం పదిహేను చోట్ల ఈ తనిఖీలను బృందాలుగా విడిపోయి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయపు పన్ను భారీగా ఎగవేశారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.
హైదరాబాద్, వరంగల్, విజయవాడ ప్రాంతాల్లో ఉన్న క్యాప్స్ గోల్డ్ కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో పదిహేను ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. భారీగా పన్ను ఎగవేతకు పాల్పడటమే కాకుండా తప్పుడు లెక్కలను చూపుతూ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేశారన్న ఆరోపణలపై ఈ సోదాలు చేశారు. బంజారా హిల్స్ లోని క్యాప్స్ గోల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలలో పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకులు పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ఐటి సంస్థ గుర్తించింది. పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతు న్నట్లు గుర్తించింది. క్యాప్స్ స్పాట్ పేరుతో బులియన్ ట్రేడింగ్ చేస్తున్న క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బంగారం, వెండి హోల్ సేల్ మార్కెట్లో క్యాప్స్ గోల్డ్ ది అత్యధిక వాటా. సికింద్రాబాద్‌లోని సోమసుందరం స్ట్రీట్‌లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న ఐటి సోదాలు జరిపింది.
క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటి శాఖకు చెందిన మూడు టీమ్ లు డైరెక్టర్ శ్రీనివాస్ నిర్వహిస్తున్న క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేసింది. గతంలో నోట్ల మార్పిడి సందర్భంలోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్ చైర్మన్ చంద్ర పరమేశ్వర్ ఇంట్లో కూడా ఐటి శాఖ సోదాలు నిర్వహించింది. మరోవైపు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి సంస్థ క్యాప్స్ గోల్డ్ అనుబంధంగా ఉన్నట్లు ఐటి గుర్తించింది. ఈ క్రమంలోనే సోదాలు జరిగాయి. వాసవి సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీలపై కూడా ఐటి సిబ్బంది దాడులు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్‌కు కూడా అభిషేక్, సౌమ్య డైరెక్టర్‌గా ఉన్నారు. వాసవికి సంబంధించిన 40 కంపెనీలకు సంబంధించిన దానిపై ఆరా తీస్తున్నారు. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పైన ఏకకాలంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.
Also Read: నియంతలా మారిన ముఖ్యమంత్రి: కెటిఆర్