Wednesday, September 10, 2025

40 శాతమే రిటర్నుల దాఖలు..

- Advertisement -
- Advertisement -

 

ITR filing

న్యూఢిల్లీ:   ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటికీ సగం మందే రిటర్నులు దాఖలు చేయగలిగారు. ఈ క్రమంలో గడువు పొడిగించాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వినతులు వస్తున్నాయి. మరోవైపు గడువు పొడిగించే ప్రణాళిక లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో రిటర్నుల దాఖలు గడువు విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది.

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ చివరి వరకు పొడిగించారు. కానీ ఈ విడత పెంపు ఉండదని ప్రభుత్వం ముందే చెప్పింది. అయినా, రిటర్నులు సమర్పించేందుకు పన్ను చెల్లింపుదారులు ఉత్సాహం చూపించడం లేదు. జులై 27 నాటికి 40 శాతం రిటర్నులు దాఖలయ్యాయి. ఈ ఏడాది నుంచి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్ మెంట్ (ఏఐఎస్) ను అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో పన్ను చెల్లింపుదారునకు సంబంధించి అన్ని రకాల ఆర్థిక సమాచారం అందులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News