Sunday, September 7, 2025

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భూరెడ్డిపల్లి వద్ద కారును వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు ఢీకొట్టడంతో కారు ముందున్న లారీని ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మంచు ఎక్కువ కురియడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News