- Advertisement -
ఎసిబి వలకు భారీ అవినీతి తిమింగళం చిక్కింది. శనివారం మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్ట ఎస్ఐ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టబడ్డాడు. జగద్గిరిగుట్ట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్.. ఓ బ్యాండ్ బృందాన్ని బెదిరించి వారి నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. బ్యాండ్ కారణంగా శబ్దకాలుష్యం వస్తుందని కేసు పెడతామంటూ బెదిరించిన ఎస్ఐ.. కేసు పెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. దీంతో బ్యాండ్ బృందం ఎసిబి అధికారులను ఆశ్రయించింది. అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం బ్యాండ్ బృందం నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ శంకర్ ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -