- Advertisement -
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి కు జ్ఞానం, సంస్కారం పెరగలేదని బిఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. రేవంత్ అబద్ధాలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ తిరుమలగిరి సభకు ప్రజల నుంచి స్పందన లేదని, స్పందన లేకపోవడంతో సిఎం బూతులు మొదలు పెట్టారని విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ హయాంలో (During BRS regime) 6.42 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని తెలియజేశారు. నిజం కాకపోతే తాను చెంపదెబ్బకు సిద్ధం అని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు.
- Advertisement -