- Advertisement -
హైదరాబాద్: తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఓ మంత్రి వణికిపోతున్నాడని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తెలిపారు. మంత్రులు తన కుర్చీ లాక్కుంటారని సిఎం రేవంత్ కు భయం పట్టుకుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఓ మంత్రి ఫోన్ మార్చేసి డబ్బా ఫోన్ వాడుతున్నాడని విమర్శించారు. బిజెపి వచ్చి బిఆర్ఎస్ లో విలీనం అవుతున్నా మాజీ సిఎం కెసిఆర్ ఒప్పుకోరని జగదీష్ రెడ్డి చెప్పారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చిన్న, పెద్ద బ్రోకర్లకు పదవులు ఇచ్చారని, ఎపి బిజెపి ఎంపి సిఎం రమేష్ తన జీవితకాలం ఎక్కువగా బాబు, రేవంత్ ఇంట్లోనే ఉంటారని విమర్శించారు. సిఎం రమేష్ ఎప్పుడూ బిజెపి ఆఫీసుకే వెళ్లలేదని, సిఎం రమేష్, బాబు, రేవంత్ డ్రామాలాడుతున్నారని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.
- Advertisement -