సిద్ధిపేట: మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై ఎపి సిఎం చంద్రబాబు, ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని మాజీ మంంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని వెనుక చంద్రబాబు, మోడీ ఉన్నారన్నారు. కెసిఆర్‌ను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కెసిఆర్ మళ్లీ వస్తే దేశంలో కీలకంగా మారుతాడని.. ఆయన ఈ కుట్రకు తెరలేపారని జగదీష్ రెడ్డి ఆరోపణలు చేశారు.
కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని బిఆర్ఎస్ మంగళవారం కవితను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులు దుర్మార్గులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కలిసి తనపై తప్పుడు ప్రచారం చేశారని.. కక్ష గట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా కుట్ర చేశారని ఆరోపించారు. కెటిఆర్ ను ఓడగొట్టేందుకు హరీష్ రావు ప్రయత్నించారని.. సిరిసిల్లలో దళితులను కొట్టించారని అన్నారు. రామన్న.. హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని.. పార్టీని, కార్యకర్తలను కాపాడాలని అన్నారు. అంతేకాదు, బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేసినట్లు కవిత తెలిపారు.