- Advertisement -
హైదరాబాద్: తన ఉద్యమ ప్రస్థానంపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితమ్మకు ఉన్న జ్ఞానానికి తన జోహార్లు అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy తెలిపారు. తను పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిని అని అన్నారు. కవిత వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి స్పందించారు. మాజీ సిఎంకెసిఆర్ శత్రువులు చేసినా వ్యాఖ్యలను ఆమె మరోసారి వల్లెవేశారని చెప్పారు. ఆమె చేసిన ప్రయత్నానికి తన సానుభూతిని (sympathy effort) తెలియజేస్తున్నానని అన్నారు. కెసిఆర్ మాట్లాడిన విషయాలే మీడియాతో చెప్పానని, కెసిఆర్ సమావేశంలో కవిత అంశం ప్రస్తావించలేదని చెప్పారు. బనకచర్ల, కాళేశ్వరం, ఎరువుల గురించి మాత్రమే మాట్లాడానని, నల్గొండలో గత గెలుపులకు తానే కారణమైతే ఇప్పుడు ఓటమికీ తానే కారణం అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -