Saturday, July 12, 2025

ఎపిలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం : జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకుని, సమాధానం నుంచి కోరుకునే అవకాశం ఉండాలని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. ఎపిలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. ఎపిలో జరుగుతున్న అణచివేతలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ జగన్ ట్వీట్ చేశారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోందని, పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ, అసమ్మతి గళాలను నులిమేస్తున్నారని మండిపడ్డారు.

గుంటూరు మిర్చియార్డులో.. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే మూడు కేసులు పెట్టి 15 మందిని అరెస్టు చేశారని, పల్నాడులో పోలీస్ వేధింపులకు (Police harassment Palnadu) ఆత్మహత్య చేసుకున్నఎమ్మెల్యే నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే 5 కేసులు 131 మందికి నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారని, బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ సిపి కేడర్ ను అక్రమంగా ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని బెదిరించి, అణచివేయాలని చూస్తోందని, ఇందుకోసం పోలీసు వ్యవస్థను వాడుకోవటం సరికాదు అని జగన్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News