అమరావతి: మహిళలపై దాడి శాడిజానికి పరాకాష్ట అని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. వైఎస్ఆర్ సిపి నేతలపై వరుస దాడులు చేయించడమే కాదని బిసి మహిళా నేతలపై నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారని అన్నారు. టిడిపి గూండాల దాడులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ..బిసి వర్గానికి చెందిన ఉప్పాల హారికపై దాడి చేయిస్తారా? ఇలా చేయడం ఏమన్నా గొప్పపనా? అని ప్రశ్నించారు. దీన్ని పరిపాలన అనరు ఎపి సిఎం చంద్రబాబునాయుడు శాడిజం అంటారని అన్నారు.
రాజకీయ పార్టీగా తమ కార్యక్రమాలు తాము చేసుకోకూడదా? అని మహిళా నేతల కార్యక్రమానికి హాజరు కాకూడదా అని నిలదీశారు. తమ నేతలను ఎందుకు హౌస్ అరెస్ట్( Why leaders under house arrest) చేయాల్సి వచ్చిందని, కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలోనూ తమరు ఇలాగే చేయిస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలున్నా సొంతింటికి వెళ్లనీయడం లేదని, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటిపైనా ప్లాన్ ప్రకారం దాడి చేయించారని, ప్రసన్న కుమార్ రెడ్డి ఎదురు కేసు పెట్టారని తెలియజేశారు. దాడి చేయించిన ఎమ్మెల్యేపై, అనుచరులపై ఎలాంటి చర్యలు లేవు అని విమర్శించారు. ఇది శాడిజం? పైశాచికత్వం కాదా? అని రాజకీయ కక్షలతో దుష్ట సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని
జగన్ ధ్వజమెత్తారు.