- Advertisement -
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్‌ఖడ్ తన అధికారిక నివాసాన్ని త్వరలోనే ఖాళీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన వస్తువులను మంగళవారం నుంచే ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ సమీపం లోని చర్చి రోడ్డులో నూతనంగా నిర్మించిన వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌కు గత ఏడాది ఏప్రిల్‌లో ధన్‌ఖడ్ మారారు. ఆ ఎన్‌క్లేవ్‌ను సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. గత 15 నెలలుగా ధన్‌ఖడ్ అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ధన్‌ఖడ్‌కు లుటియన్స్ ఢిల్లీలో టైప్ 8 , లేదా మరో ప్రాంతంలో బంగ్లా ఇచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణంగా టైప్ 8 బంగ్లాను కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల అధ్యక్షులకు కేటాయిస్తారు
- Advertisement -