- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను చిల్లర పార్టీ అంటారా అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని మాజీ సిఎం కెసిఆర్ చెప్పలేదా? అని బిఆర్ఎస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పై మాట్లాడిన కెటిఆర్ కు క్యారెక్టర్ లేదని, రాజకీయ పరిపక్వత లేదని జగ్గారెడ్డి విమర్శించారు.
- Advertisement -