- Advertisement -
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సెక్యురిటీ లేకుండా బయట తిరగగలరా? అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గా రెడ్డి) ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మగాడైతే రా ..అంటూ కెటిఆర్ సవాల్ చేయడం పట్ల జగ్గారెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ నాటు కోడి అయితే, కెటిఆర్ బ్రాయిలర్ కోడి లాంటి వారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనవసరంగా రెచ్చగొట్ట వద్దని ఆయన హితవు పలికారు.
- Advertisement -