Friday, August 15, 2025

స్వాతంత్య్ర ఉద్యమంలో బిజెపి పాత్ర లేదు: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో బిజెపి పాత్ర ఏమీ లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్వికులను అడిగితే వాస్తవాలు ఏమిటో చెబుతారని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై విమర్శలు చేయడమే లక్షంగా పెట్టుకున్నారని బిజెపి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాల గురించి తెలియని బిజెపి నాయకులు త్యాగాల కుటుంబంపై నిందలు వేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. ధర్మం గురించి మాట్లాడే బిజెపి నేతలకు వారసత్వం గురించి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబం కాశ్మీర్‌లోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారన్నారు.

సోనియా, రాహుల్ గాంధీలకు ఉన్న గొప్ప గుణం బిజెపి నేతల్లో ఎవరికైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజలు గతంలో సోనియా గాంధీని ప్రధానిని చేయాలన్న భావనతో కాంగ్రెస్‌ను గెలిపిస్తే, సోనియా గాంధీ ఆ పదవిని తీసుకోకుండా ప్రధానిగా మన్మోహన్ సింగ్‌ను నియమించారన్నారు. త్యాగాల గురించి మీకు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోతే కొట్లాడుతానని జగ్గారెడ్డ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News