Tuesday, August 12, 2025

‘పరమ్ సుందరి’ ట్రైలర్.. జాన్వీ యాక్టింగ్ ఇరగదీసింది..

- Advertisement -
- Advertisement -

‘దేవర’ సినిమాతో సౌత్ ఇండిస్ట్రీలో మంచి సక్సెస్‌ను అందుకుంది అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా ‘పరమ్ సుందరి’ (Param Sudari). ఇందులో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, పాటలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో జాన్వీ కేరళ అమ్మాయిలా, సిద్ధార్థ్ ఢిల్లీ కుర్రాడిలా నటిస్తున్నారు. ‘విధికి ప్రేమకి మధ్య ఏది ఎంచుకుంటారు’ అని ట్రైలర్‌లో పేర్కొన్నారు. చివర్లో సౌతిండియా స్టార్ హీరోలు రజనీకాంత్, మోహన్‌లాల్, అల్లు అర్జున్, యశ్‌లను జాన్వీ ఇమిటేట్ చేసి మెప్పించింది. ఇక ఈ సినిమాకు నిర్మాతగా దినేశ్ విజాన్ వ్యవహరిస్తుండగా.. తుషార్ జలోటా దర్శకత్వం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News