Wednesday, June 25, 2025

‘తమ్ముడు’ నుంచి జై ‘బగళాముఖీ’ సాంగ్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మూవీ ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, బేబీ శ్రీరామ్ దిత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ‘తమ్ముడు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

మంగళవారం ‘తమ్ముడు’ సినిమా నుంచి ‘జై బగళాముఖీ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, అజనీష్ లోకనాథ్ ఆధ్యాత్మిక ట్యూన్ తో కంపోజ్ చేశారు. సింగర్ అబీ వీ ఆకట్టుకునేలా పాడారు. ’జై బగళాముఖీ..’ పాట ఎలా ఉందో చూస్తే ‘జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, జై జయకారిణీ, విద్రుమ రూపిణి, విభ్రమ కారిణి, గగనఛత్ర వింధ్యాచలవాసిని, వీర విహారిణి, క్షుద్ర విదారిణి, సర్వజీవ సంరక్షిణి జననీ…’ అంటూ సాగుతుంది ఈ పాట. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి మహిమను కీర్తిస్తూ గ్రామ జాతర వేడుక సందర్భంగా ‘జై బగళాముఖీ..’ పాటను చిత్రీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News