Friday, May 30, 2025

రేపు బాచుపల్లిలో ‘జై హింద్ యాత్ర సభ’

- Advertisement -
- Advertisement -

‘జై హింద్ యాత్ర సభ’ రేపు(గురువారం) బాచుపల్లిలో జరుగనుంది. ఈ ర్యాలీలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆపరేషన్ సిందూర్‌ను రాజకీయంగా వాడుకుంటున్న బిజెపి పార్టీ వైఖరిని ఎండగట్టడం, భారత్, -పాకిస్థాన్ కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలకు మౌనంగా ఉన్న ప్రధాని మోడీ తీరును విమర్శించడం, సైనికులకు సంఘీభావం తెలపడమే లక్ష్యంగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఈ యాత్ర, సభను నిర్వహిస్తున్నారు. కాగా, ఈ యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు విఎన్‌ఆర్ కాలేజీ నుంచి కెజిఆర్ కన్వెన్షన్ వరకు జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నిజాంపేట్- బాచుపల్లి రోడ్డులోని కెజిఆర్ కన్వెన్షన్‌లో భారీ సభ నిర్వహించనున్నారు.

ఈ సభకు ముఖ్య అతిథులుగా సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ఏఐసిసి ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి ఎక్స్-సర్వీస్ మెన్ కమిటీ చైర్మన్ కల్నల్ రోహిత్ చౌదరి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని టిపిసిసి ఓ ప్రకటనలో కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News