Sunday, May 18, 2025

కాంగ్రెసోడివైతే ..కాంగ్రెస్‌వాదివి కా

- Advertisement -
- Advertisement -

శశి థరూర్‌కు జై రాం రమేష్ చురక

న్యూఢిల్లీ : కాంగ్రెస్ లో ఉంటే , కాంగ్రెస్ వాదిగానే ఉండటం మంచిదని పార్టీ సీనియర్ ఎంపి శశి థరూర్‌కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చురకలు పెట్టారు. ఉగ్రవాద చర్యల పాకిస్థాన్‌ను ఎండగట్టేందుకు కేంద్రం తలపెట్టిన బహుళ పార్టీల ప్రతినిధి బృందంలో ఎంపి థరూర్‌ను ఎంపిక చేయడంపై జై రాం రమేష్ శనివారం స్పందించారు.

బృందంలో ఆయన పేరు ప్రకటించడం పార్టీ వర్గాల నుంచి నిరసన వెల్లువెత్తింది ఇక పార్టీలో నెలకొంటున్న తీవ్రస్థాయి విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎంపి కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు. అయితే ఆయన వైఖరి పూర్తి స్థాయిలో పార్టీవాడిననే విధంగానే ఉండాల్సి ఉందని రమేష్ చెప్పారు. కాంగ్రెస్ మహా గంగా నది వంటిది. పలు ఉపనదులు ఉంటాయి. ఇందులో కొన్ని అంతరించి పోతాయి. అయితే మరికొన్ని కలుషితం అవుతాయని రమేష్ థరూర్ వైఖరిని ఎండగట్టారు. అయితే థరూర్‌పై ఏదైనా చర్య ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.

పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూరను ఎంపి థరూర్ సమర్థించడం, మోడీ నాయకత్వం అవసరం అనడం వంటి ఉదంతాలతో పార్టీలో అంతర్గత తగాదాలు బహిరంగం అయ్యాయి. పైగా ప్రధాని మోడీ తిరువనంతపురంలో జరిగిన సభలో ప్రత్యేకించి థరూర్‌ను కొనియాడటం , ఆయన తమ వేదికపై ప్రముఖంగా ఉండటం కాంగ్రెస్‌లోని కొందరు నేతలకు నిద్రపట్టనివ్వదని చమత్కరించడం వంటి పరిణామాలు కీలకంగా మారాయి. దశలో తాజా వివాదం రగులుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News