Wednesday, July 16, 2025

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్ సమావేశం

- Advertisement -
- Advertisement -

బీజింగ్: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. మంగళవారం బీజింగ్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా జైశంకర్ వెల్లడించారు. 2020లో గల్వాన్ లోయ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత భారత విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ)కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనడం కోసం జైశంకర్ చైనా వెళ్లారు. ఎస్‌సిఒ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఇతర దేశాల విదేశాంగ మత్రులతో కలిసి అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసినట్లు జైశంకర్ తెలిపారు. అధ్యక్షుడిని కలిసిన సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలను తెలియజేసినట్లు జైశంకర్ ఎక్స్ పోస్టులో తెలియజేశారు. భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News