మనతెలంగాణ సిటీ బ్యూరో: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఇద్దరికి అధికారులు జరిమానా విదించారు. ఈ ఘటన బంజారా హిల్స్ లో జరిగింది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారా హిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా… రోడ్ నం.12లో నీరు లీకేజి అయినట్టు ఎండీ గమనించి.. స్థానిక మేనేజర్ ను లీకేజికి కారణాలు అరా తియ్యమని ఆదేశించారు. దీంతో ఓ అండ్ డివిజన్ స్థానిక మేనేజర్ వెళ్లి పరిశీలించారు. అయితే దగ్గరికి వెళ్లి చూస్తే ఒక వ్యక్తి జలమండలి సరఫరా చేసి నీటితో కార్, బైక్ కడిగాడు. అదే విషయం ఎండీకి విన్నవించారు. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసి.. తాగునీటిని అలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని చెప్పారు.
అంతే కాకుండా అతనికి నోటీసు అందించి, జరిమానా వెయ్యాలని సంబంధిత మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.10000 జరిమానా విదించారు. అలాగే ఆ ప్రాంతంలోనే మరో వ్యక్తి తాగునీటి సంపు నిండి ఓవర్ ఫ్లో అయి దాదాపు ఒక కిలో మీటర్ వరకు తాగునీరు రహదారిపై ప్రవహించింది. నిర్లక్ష్యంతో నీటిని వృదా చేసినందుకు ఈ వ్యక్తికీ రూ.5000 జరిమానా విధించారు