ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో పటౌడీ ట్రోఫీగా ఉన్న ఈ ట్రోఫీకి తాజాగా టెండూల్కర్-అండర్‌సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. దీనిపై తాజాగా జేమ్స్ అండర్‌సన్ (James Anderson) స్పందించారు. సచిన్ పక్కన తన పేరు ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. తొలిసారి ఇలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
‘‘సచిన్ టెండూల్కర్ ప్రస్తుత క్రికెటర్లలో ఓ దిగ్గజం. అలాంటి క్రికెటర్‌తో కలిసి ట్రోఫీని పంచుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన పేరు మీద ట్రోఫీ ఉండటం పెద్ద విషయమే. అందులోనూ కప్ పక్కన సచిన్‌తో కలిసి నా పేరు ఉండటం భిన్నమైన అనుభూతి. సచిన్ ఆట చూస్తూ పెరిగాను. అతడిని ప్రత్యర్థిగా ఆడాను. భారత్ ఆశలను తన భుజాలపై మోసిన ఐకానిక్ ప్లేయర్ సచిన్. అలాంటి క్రికెటర్‌తో కలిసి ట్రోఫీని ఆవిష్కరిండం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. క్రికెట్‌లో నేను సాధించిన దాని గురించి అభిమానులు మాట్లాడుకొనేప్పుడు.. నేనేనా ఇదంతా సాధించింది అని అనిపిస్తుంది’’ అని అండర్‌సన్ (James Anderson) అన్నారు.