Monday, September 8, 2025

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌… ఉగ్రవాది హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం కుల్గాంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవార ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతాదళాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆపిల్ తోటలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో భద్రతాదళాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. భద్రతా దళాల వినికిడితో ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యారు.  తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Also Read: ఉరుమురిమి హరీశ్‌పైనా?

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News