Sunday, August 10, 2025

ఆ యువతితో రాఖీ కట్టించుకొని.. పుకార్లకు చెక్ పెట్టిన సిరాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమిండియా పాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒక నెల రోజులు బ్రేక్ తీసుకున్నాడు. ఈ బ్రేక్ ను తన కుటుంబ సభ్యులతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సిరాజ్ రాఖీ పండుగను జరుపుకున్నారు. ఓ యువతి సిరాజ్ కు రాఖీ కట్టి పుకార్లు చెక్ పెట్టింది. గాయని ఆశా భోస్తే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ ప్రేమాయణం నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలు ఒకే ఒక పండగ పుల్ స్టాప్ పెట్టింది. రాఖీ పండగ సందర్భంగా సిరాజ్ కు జునై భోస్లే రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా ఆశా కూడి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఒక పాత ఫొటోను పట్టుకొని సిరాజ్, ఆశా మధ్య ప్రేమాయణం నడుస్తోందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఈ ఫొటో వైరల్ కావడంతో పాటు ఐపిఎల్ మ్యాచ్ సిరాజ్ ఉన్న జట్టుకు ఆశా మద్దతు తెలపడంతో పుకార్లకు మరింత బలం చేకూరింది. రాఖీ కట్టిన వీడియోను పోస్టు చేయడంతో పాటు ఇంతకంటే గొప్పది తాను కోరుకోవడం లేదని, నా ప్రియమైన అన్నయ్య అని సంబోధించింది. తన చెల్లి లాంటి వారు ఎవరూ లేరని సిరాజ్ పోస్టు చేశారు. దీంతో ఇద్దరు మధ్య అన్నచెల్లెల అనుబంధం ఉందని తెలిసిపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News