- Advertisement -
అమరావతి: పోలీసులందరినీ విఆర్ లో పెట్టమనేది అడ్మినిస్ట్రేసన్ లో భాగమే అని ఎపి పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు (Janakula Srinivasa Rao) తెలిపారు. జగన్ వ్యాఖ్యలకు జనకుల శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. పోలీసులపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు. ఎపి పోలీసులను దేశమొత్తం ప్రశంసిస్తోందని జగన్ కు ఇది కనపడట్లేదా? అని మాజీ సిఎంగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన తమరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో కూడా ఇదే పనిచేశారు కదా దాన్ని కూడా కించపరిచేలా మాట్లాడతారా? అని నిలదీశారు. విఆర్ లో పెట్టాకే అధికారులు (Officials VR) సామర్థ్యాలకు అనుగుణంగా పోస్టులు ఇస్తారని, విఆర్ ఉన్నవారికి పోస్టింగ్ ల విషయంపై హెచ్ వొడిలు నిర్ణయం తీసుకుంటారని జనకుల శ్రీనివాసరావు పేర్కొన్నారు.
- Advertisement -