Saturday, July 5, 2025

స్టాక్ మార్కెట్లో జేన్ స్ట్రీట్ మాయాజాలం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎంత నిఘా పెట్టినప్పటికీ స్టాక్ మార్కె ట్లో మోసాలు ఆగడం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ప్రొప్రైటరీ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ భార త మార్కెట్లలో భారీ మోసానికి పాల్పడినట్టు మా ర్కెట్ రేగ్యులేటర్ సెబీ గుర్తించింది. ఎలాంటి లా వాదేవీల జరపకుండా ఈ కంపెనీపై నిషేధం వి ధించింది. భారతీయ మార్కెట్లలో లొసుగులను వా డుకుని ఈ కంపెనీ మోసానికి పాల్పడింది. దీంతో జెన్ స్ట్రీట్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై సె క్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. డెరివేటివ్స్ మార్కెట్ లో విలువ తారుమారు చేస్తూ కేవలం 21 రోజుల్లో నే రూ. 4,843.57 కోట్ల అక్రమ లాభాన్ని ఆర్జించినట్లు సెబీ నిర్ధారించింది. ఈ విధంగా ఈ అమెరికన్ ట్రేడింగ్ కంపెనీ 2023 జనవరి నుంచి 2025 మార్చి 31 వరకు రూ.43,289 కోట్ల లా భాలను ఆర్జించినట్లు తేలింది. సెబీ 2024 జనవరి 17వ తేదీతో పాటు మరో 14 బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ డేట్లలో జెన్ స్ట్రీట్ అనుసరించిన విధానాలను సెబీ పరిశీలించింది.జేన్ స్ట్రీట్ గ్రూప్ ఒక అమెరికన్ ట్రేడింగ్ కంపెనీ, ఇది అధునాతన టెక్నాలజీ, గణిత ఆధారిత మోడల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ట్రేడ్ చేస్తుంది. భారతదేశంలో ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ,

నిఫ్టీ 50 ఇండెక్స్ ఆప్షన్ల లో విస్తృతంగా ట్రేడింగ్ చేసింది. సెబీ నిషేధించిన సంస్థల జాబితాలో భారత్‌లో జేన్ స్ట్రీట్‌కు చెందిన మూడు అనుబంధ సంస్థలు జెఎస్‌ఐ2 ఇన్వెస్ట్‌మెంట్స్, జేన్ స్ట్రీట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, జే న్ స్ట్రీట్ ఆసియా ట్రేడింగ్ లిమిటెడ్ ఉన్నాయి. జేన్ స్ట్రీట్ ఇండెక్స్ ఆప్షన్ల ద్వారా లాభాలను లక్షంగా చేసుకుంది. దీని కోసమే ఇండెక్స్‌ను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసిందని సెబీ ఆరోపిస్తోంది. జేన్ స్ట్రీట్ ముఖ్యంగా ఎక్స్‌పైరీ డే రోజున ఉద యం నుంచి మధ్యాహ్నం వరకూ రెండు దశల్లో మార్కెట్‌ను ప్రభావితం చేసింది. జేన్ స్ట్రీట్ రూ. 4,370 కోట్ల విలువైన బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, షేర్లను కొనుగోలు చేసింది. దీని వల్ల ఇండెక్స్ పెరిగింది, పుట్ ఆప్షన్ల ధరలు పడిపోయాయి. అదే సమయంలో కంపెనీ పెద్ద మొత్తంలో పుట్ ఆప్షన్లను కొనుగోలు చేసి, కాల్ ఆప్షన్లను అమ్మింది. మధ్యాహ్నం సమయంలో 11:49 నుంచి 3:30 వరకు ఇదే సంస్థ తన స్టాక్స్, ఫ్యూచర్ పొజిషన్లను అమ్మడం ప్రారంభించింది. దీని వల్ల మార్కెట్ క్షీణించింది. పుట్ ఆప్షన్ల ధరలు పెరిగి, సంస్థకు భారీ లాభాలు వచ్చాయి.

లాభనష్టాల వివరాలు
ఒక్కరోజే జేన్ స్ట్రీట్ ఆప్షన్లలో రూ.735 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్యాష్, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో రూ.61.6 కోట్ల నష్టం చూసినప్పటికీ, మొత్తంగా రూ.673.4 కోట్ల నికర లాభం దక్కింది. ఇది మార్కెట్‌కు నష్టాన్ని కలిగించడంతో పాటు చిన్న పెట్టుబడిదారులకు అన్యాయం జరిగేలా చేసింది.
సెబీ చర్యలు
ఈ చర్యలను మార్కెట్ మానిప్యులేషన్‌గా పరిగణించి సెబీ కఠినంగా స్పందించింది. జేన్ స్ట్రీట్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలను స్టాక్ మార్కెట్‌కి ఎంట్రీ ఇవ్వకుండా నిషేధించింది. అలాగే రూ.4,843.57 కోట్ల అక్రమ ఆదాయాన్ని జప్తు చేయాలని ఆదేశించింది. ఈ పరిణామం భారత మార్కెట్లలో పారదర్శకతకు సంబంధించి కీలక పరిణామం అని నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News