Friday, June 20, 2025

లండన్ వీధుల్లో బాయ్ ఫ్రెండ్తో జాన్వీ కపూర్.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్, శిఖర్ పహారియాతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూమర్స్ పై ఎప్పుడూ వారు స్పందించడం గానీ, ఖండించడం గానీ చేయలేదు. ఎన్నోసార్లు జాన్వీ, శిఖర్ కలిసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయినా జాన్వీ, శిఖర్ కలిసి తిరగడం మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో పలుసార్లు శిఖర్ తో జాన్వీ తిరుమలను సందర్శించింది కూడా. తాజాగా మరోసారి ఈ ప్రేమ జంట చేట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.

దీనిలో ప్రేమికులు ఒకరితో ఒకరు మంచి సమయం గడుపుతున్నట్లు చూడవచ్చు.  జాన్వీ కపూర్, శిఖర్ లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని సంతోషంగా లండన్ వీధుల్లో నడుస్తూ కనిపించారు. ముందు వీరిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా.. వెనుక జాన్వీ సోదరి ఖుషీ కపూర్ వారిని ఫాలో అవుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపించింది. కాగా జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటించి తన అందచందాలతో కుర్రకారులకు మత్తెక్కించింది. తెలుగుతోపాటు పలు బాలీవుడ్ మూవీస్ తో జాన్వీ బిజీగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News